telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫోన్ చేశా… కానీ పోజ్ కొట్టింది… శ్రీముఖిపై రాహుల్ సెటైర్లు

telugu bigg boss 3 srimukhi and rahul

100 రోజులకుపైగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ హౌస్… కొందరు హౌస్ మేట్స్ మధ్య చిచ్చు కూడా పెట్టింది. బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య గ్యాప్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. తాజాగా నవంబర్ 29న రాహుల్ ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాడు. దానికోసమే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసాడు బిగ్ బాస్ విన్నర్. తాను చేయబోతున్న లైవ్ కన్సర్ట్‌కు చాలా మంది సెలెబ్రిటీస్ కూడా వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ఈయన. అంతేకాదు.. బిగ్ బాస్ టీం అందర్నీ కూడా తాను పిలిచానని.. అయితే అందులో ఎంతమంది వస్తారనేది మాత్రం తనకు తెలియదంటున్నాడు. ముఖ్యంగా తన గ్యాంగ్ పున్ను, వరుణ్ సందేశ్, వితిక మాత్రం 100 పర్సెంట్ వస్తారని కన్ఫర్మ్ చేసాడు రాహుల్. ఇక శ్రీముఖి విషయానికి వచ్చేసరికి… తను రెండు రోజుల కింద శ్రీముఖికి ఫోన్ చేసానని, అయితే తన ఫోన్ ఎవరో వేరే వాళ్లు ఎత్తి షూట్‌లో ఉన్నట్లు చెప్పారని తెలిపాడు. నేను రాహుల్ మాట్లాడుతున్నానని చెప్తే ఇప్పుడు వీడెందుకు ఫోన్ చేసాడన్నట్లు ఫోజ్ కొట్టారని, శ్రీముఖికి తాను ఫోన్ చేసినట్లు తెలిసిన తర్వాత కూడా ఇంకా తిరిగి కాల్ చేయలేదని, తాను అన్నీ క్లియర్ చేసిన తర్వాత కూడా ఇంకా మనసులోనే పెట్టుకుంటే ఎవరేం చేయలేరని, శ్రీముఖి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయిందని, మరి తాను ఫోన్ చేసిన సంగతి గుర్తుందో లేదో అంటూ సెటైరికల్ కమెంట్ చేసాడు.

Related posts