telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

టమోటాలు తిననివ్వలేదని సొంత తాతను ఈ యువతి ఏం చేసిందంటే ?

Teen

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం నాసావు కౌంటీలో కేటీ జాడే గేట్స్ (19) అనే యువతి తన తాతయ్య, నాన్నమ్మలతో కలిసి నాసావు కౌంటీలోని కల్లాహన్ టౌన్‌లో నివాసముంటోంది. ఈ క్రమంలో ఈ నెల 12న రాత్రి భోజనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కేటీ జాడే డిన్నర్‌కు ఉపక్రమించింది. టమోటాలు అంటే ఎంతో ఇష్టంగా తినే ఆమెకు ఆ రోజు తన వాటా కంటే ఎక్కువ తింటానని పట్టుబట్టింది. దానికి ఆమె తాతయ్య అంగీకరించలేదు. అంతే.. కేటీ జాడే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. చేతిలో ఏం దొరికితే వాటితో వృద్ధులపై దాడికి పాల్పడింది. నాన్నమ్మ వారిస్తున్న వినిపించుకోకుండా ఆమె కంటిపై సిగరెట్ ప్యాకెట్‌ను విసిరికొట్టింది. అంతటితో ఆగకుండా 65 ఏళ్ల వృద్ధుడైన తాతను చేత కత్తి పట్టుకొని పొడిచేస్తానంటూ ఇంట్లోంచి తరిమికొట్టడం మొదలెట్టింది. ఆమె చర్యతో భయపడిపోయిన ముసలాయన చేసేదేమిలేక ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు. చేతిలో కత్తితో వృద్ధుడిని తరుముకుంటూ వెళ్లిన కేటీ జాడే ఎమైనా చేస్తుందేమోనని భయపడిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న నాసావు కౌంటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెపై వృద్ధుడి మీద మారణాయుధంతో దాడి, తీవ్ర హింస కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. తాజాగా యువతిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో విచారణ అనంతరం రూ. 12 లక్షల 70వేల పూచీకత్తుపై యువతి విడుదలైంది.అలాగే బాధితులతో ఎటువంటి సంబంధం కలిగి ఉండకూడదని యువతిని న్యాయమూర్తి ఆదేశించారు.

Related posts