ఆర్టీసీ ఆస్తుల్ని దోచుకునేందుకు కేసీఆర్ కుటుంబం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్టీసీ జేఏసీ సరూర్‌నగర్‌లో నిర్వహించిన సకల జనుల సమర భేరిలో ఆయన మాట్లాడుతూ మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సిద్ధంకావాలని పిలుపు ఇచ్చారు. ఆర్టీసీ విలీనంపై హామీ ఇవ్వలేదని..ఊసరవెల్లి ఎర్రబెల్లి మాట్లాడుతున్నారని అన్నారు.
50శాతం ప్రైవేటీకరణ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ నడ్డి విరగ్గొట్టేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ 14 ఏళ్లు తెలంగాణ ప్రజలకు భ్రమలు కల్పించారని, తెలంగాణ వచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. అన్ని పనులు హైకోర్టు చేస్తే కేసీఆర్ గాడిద పళ్లు తోముతారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ లో ఉత్తమ్ తప్ప మరెవ్వరూ ఉండరు..రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు