telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోల రేంజ్ లో హన్సిక కూడా…!!

Hansika

ఒక‌ప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా రాణించిన హ‌న్సిక ప్ర‌స్తుతం చాలా వెనుక పడిపోయింది. దాదాపు ద‌శాబ్ధ కాలంగా త‌న గ్లామ‌ర్‌తో అల‌రిస్తూ వ‌స్తున్న హన్సిక కెరీర్‌లో 50 సినిమాలు చేసింది. తమిళంలో బిజీగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం హన్సిక చేతిలో మాత్రం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇదిలా ఉండగా… ఈ అమ్మడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోస్ స‌ర‌స‌న నిలిచి హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకి వస్తే… కోలీవుడ్‌లో విజ‌య్, ధ‌నుష్‌, శంక‌ర్ వంటి వారు మాత్ర‌మే రోల్స్ రాయ్స్ ల‌గ్జ‌రీ కారు వాడుతున్నారు. తాజాగా హ‌న్సిక త‌ల్లి డాక్ట‌ర్ మోనా హ‌న్సిక‌కి రోల్స్ రాయ్స్ ఫాంట‌మ్ 8 సిరీస్‌ని దీపావ‌ళి గిఫ్ట్‌గా ఇచ్చార‌ట‌. దీని ధ‌ర 12 కోట్ల పై మాటే అంటున్నారు. లగ్జరీ కారు విష‌యంలో హ‌న్సిక స్టార్ హీరోల సరసన నిలవడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Related posts