ట్విట్టర్ వేదికగా కంగనా రనౌత్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గృహిణులు చేస్తున్న ఇంటి పనిని వేతన వృత్తిగా తమ పార్టీ గుర్తిస్తుందని ఈ మధ్య కమల్ హాసన్ తెలిపారు. దానిపై కాంగ్రెస్ నేత శశి థరూర్ పాజిటివ్ గా స్పందించారు. కమల్ ఆలోచనలను తాను స్వాగతిస్తున్నానని చెబుతూ, కమల్ వ్యాఖ్యలను రీ ట్వీట్ చేశారు శశిథరూర్. అయితే శశిథరూర్ తో పాటు కమల్ ఆలోచనా విధానాన్ని కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించింది. హోమ్ క్వీన్ గా ఉండే మహిళలను హోమ్ ఎంప్లాయ్ గా జమ కట్టవద్దని గట్టిగా బదులిచ్చింది. మహిళ ఇంటికి యజమానురాలు. ఆమె చేసే సేవలకు, త్యాగాలకు వెల కట్టాలని అనుకోవడం… ఈ సృష్టిని రూపొందించిన దేవుడికి డబ్బు చెల్లించడం లాంటిది. అలాంటి ఆలోచన హాస్యాస్పదం గానూ, అర్థం లేనిది గానూ ఉంది. మాతృత్వం కోసం ఓ మహిళ జరిపే శృంగానికి మీరు వెలకట్టడం సమంజసమా? అని ప్రశ్నించింది ట్విట్టర్ వేదికగా కంగనా ప్రశ్నించింది. ఇదిలా ఉంటే… ఇదే సమయంలో జస్టిస్ రమణ ఓ తీర్పు సందర్భంగా ‘ఇంటి పని తీరును బట్టి గృహిణుల శ్రమకు తగ్గ విలువను లెక్కించబడే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంద’ని పేర్కొన్నారు.
previous post
స్టాలిన్ షాక్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్: విజయశాంతి