telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఏసీపీ నర్సింహారెడ్డి విచారణలో బయటపడ్డ నిజాలు..

హైదరాబాద్ ఎసీపి నర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు అతని దగ్గర ఉన్న ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు..ఏసీపి ని మరోసారి ప్రశ్నించిన అధికారులకు కీలక విషయాలను చెప్పాడు.మొత్తం ఈ కేసులో 13 మందిని నిందితులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో 11 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఎసీపి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారంతా ఈ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.

 

అతని అక్రమ ఆస్తులను కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించినట్లు అధికారులు వెల్లడించారు.అంతేకాదు.. కజ్బా భూములను కూడా బెదిరించి లాక్కున్నట్లు తెలుస్తుంది.బినామి ఆస్తులను భారీగా గుర్తించారు. హైదరాబాద్ నాలుగు నివాస గృహాలు, అనంతపురం లో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. నాలుగు రోజులు ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్న అతన్ని నాంప‌ల్లిలోని ఏసీబీ కార్యాల‌యానికి ఈ ఉద‌యం త‌ర‌లించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Related posts