రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను తిరిగి నియమించాని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆదేశించడంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని గవర్నర్ ఆదేశించడం శుభపరిణామమని నారాయణ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి జగన్ కు అన్ని దారులు మూసుకుపోయాయని చెప్పారు. జగన్ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పటికైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని నారాయణ హితవు పలికారు.
కుప్పం కెనాల్ పనుల నిలిపివేతపై చంద్రబాబు ఫైర్