భారత రాష్ర్టపతిగా అభ్యర్ధిత్వాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో నేటి రాత్రి 7 గంటలకు జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వెంకయ్యనాయుడు ను ప్రకటించే అవకాశం ఉంది.
మూడు రోజు పర్యటన లో భాగంగా వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో జరిగే యోగా డేలో పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు కు ఢిల్లీ అధిష్టానం నుంచి అర్జెంట్‌గా రమ్మని పిలుపు రావడంతో తన హైదరాబాద్ పర్యటనను అర్థంతరంగా ముగించుకుని ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్ళారు.
కాగా విఫక్షాలు యశ్వంత్ సిన్హా పేరు ను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఇంతకాలం బీజేపీ ఏ అభ్యర్ధిని రాష్ర్టపతిగా ఎంపిక చేస్తున్నారనే దానిపై రకరకాలుగా ఉహాగానాలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో ఢిల్లీలో ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు నివాసంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి చర్చించారు.
దీంతో హైదరాబాద్ లో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ పిలిపించడం వెనుక ఆంతర్యం ఇదేనా అనిపిస్తుంది . కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనలు ప్రకారమే ఈ ముగ్గురు (అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్) కలి సినట్లు తెలుస్తోంది .
ఈ రోజు సాయంత్రం జరిగే పార్లమెంట్ సమావేశం తరువాత వెంకయ్య నాయుడు పేరును అధికారికంగా ప్రకటించవచ్చు.