telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

sabitaindrareddy

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది ఒకేసారి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 80 వేల 516 మంది హాజరు కాగా…60.01 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలబడింది. ఇక రెండో స్థానంలో 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కుమ్రంభీం జిల్లాలు చోటు దక్కించుకున్నాయి.

ఇక ద్వితీయ సంవత్సరంలో 4 లక్షల 85 వేల 323 మంది విద్యార్థులు హాజరు కాగా… 68.86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం తొలి స్థానంలో నిలబడింది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ రెండో స్థానం దక్కించుకుంది. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, bie.telangana.gov.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.

Related posts