telugu navyamedia
సినిమా వార్తలు

“కావ్యకన్య!”

na varija netri poetry corner
మదిలో ప్రేమ సుమ మై –
కవిత విరచించు 
వరమిచ్చు కావ్యకన్యవై-
భావ  తరంగాల వెంట
 జాగృత పరచి,
స్వేచ్ఛగా  పరుగులెత్తించిన  
పరి బృంహణ మై-
 దివ్య సుందరి వై-
 ప్రభలతో శోభించే 
ప్రణయ దేవతవై
 ఉదయించిన నీవే
 నా కలల రాణివి!
నయన నివాసవి!
 ఆనంద వరుణ రాశివి!
అమృతమయ స్వరూపానివి! 
అనంత భావాలు ప్రసాదించే
కావ్యకన్యవి! 
-మహేంద్రాడ  సింహాచలాచార్య,
 టెక్కలి

Related posts