telugu navyamedia
సినిమా వార్తలు

జగన్ ప్రమాణస్వీకారానికి భార్యతో హాజరైన మంచు హీరో

MAnchu-Vishnu-and-YS-JAgan

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈరోజు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12:23 గంటలకు “జగన్ అనే నేను…” అంటూ ఆయన దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యఅతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులు కూడా హాజరయ్యారు. గురువారం ఉదయమే విజయవాడ చేరుకున్న విష్ణు, విరన్సికా ప్రమాణ స్వీకారం జరిగే ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఆయన రాకను చూసి నినాదాలు, ఈలలతో హోరెత్తించారు. అతిథులు రాక మొదలుకుని ప్రమాణ స్వీకారం పూర్తయ్యి జగన్ ఇంటికి తిరుగు పయనమైనంత వరకు విష్ణు దంపతులు స్టేడియంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా విరన్సికా, జగన్ తో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ… ప్రమాణ స్వీకారోత్సవం, ఏపీ సీఎం, వైఎస్ జగన్, జగన్ అనే నేను అంటూ ట్యాగ్ చేశారు. ఈ ఫోటో చూసిన వైసీపీ అభిమానులు, మంచు అభిమానులు కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.

Related posts