జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ముష్కరులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డాయి. తాజాగా పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిపిన ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. అవంతిపుర సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై తొలుత తుపాకీలతో కాల్పులు జరిపిన అనంతరం ఐఈడీతో దాడులు చేశారు. ఈ ప్రమాదంలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పేలుడు వల్ల ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై తామే దాడి చేసినట్లు జైషే ఈ మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్ ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన ఓ ఆటోరిక్షాలో ఐఈడీని ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ కాన్వాయ్ అక్కడికి రాగానే ఆ వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చేశారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం ముక్కలు ముక్కలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తొలుత తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఆ తర్వాత గ్రనేడ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
అవన్నీ విజయసాయిరెడ్డి కోర్టులో చెప్పుకొంటాడు: దేవినేని ఉమ