telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. ఇబ్బందుల్లో ప్రయాణీకులు

special train between vijayawada to gudur

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ప్రధాన నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. తాజాగా పశ్చిమ, నైరుతి, దక్షిణ రైల్వేలో పలు సర్వీసులు రద్దు చేశారు.

కొన్ని నదుల్లో వరద ప్రవాహం ప్రమాదస్థాయిని మించి ఉంది. నీటికి పట్టాలు దెబ్బతినడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి ముందస్తు చర్యగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు గాంధీధామ్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. అదేవిధంగా ఈ నెల 13న విశాఖ-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు, ఈ నెల 14న సికింద్రాబాద్‌-విశాఖ ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు. రేపు ధన్‌బాద్‌లో బయలు దేరాల్సిన ధన్‌బాద్‌-అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌ ను కూడా అధికారులు రద్దు చేశారు.

Related posts