తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కాన్వాయ్ లో ఎస్సై వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తపల్లి ఎస్సై ఎల్లగౌడ్ గాయపడ్డారు. ఆయన బొటనవేలు తెగిపడినట్టు సమాచారం. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి వస్తున్న సందర్భంగా ఆయన కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ లోని ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద ఈ ఘటన జరిగింది.
చంద్రబాబు కష్టపడినప్పటికీ.. టీడీపీ ఎమ్మెల్యేలు గజదొంగలు: సీపీఐ నారాయణ