telugu navyamedia
సినిమా వార్తలు

“డామ్… నాకు ఇంకొకరు పోటీ…!!” : ఆర్జీవీపై బిగ్ బీ ట్వీట్

Amitab Bachchan Tweet on RGV

ఇటీవలే “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాతో చాలాకాలం తరువాత హిట్ ను అందుకున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన తరువాత ప్రాజెక్టులుగా శశికళ, కేసీఆర్ బయోపిక్ లు ఉండబోతున్నాయని ప్రకటించారు. కానీ ఇప్పుడు రూటు మార్చి తన పుట్టినరోజు సందర్భంగా “కోబ్రా” మోస్ట్ డేంజరస్ క్రిమినల్ బయోపిక్ అంటూ మరో ప్రకటన ఇచ్చేశారు. ఇప్పటి వరకూ దర్శకుడిగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా తన సత్తా చాటిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నటుడుగా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయంపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. “చిట్టచివరకు రామ్ గోపాల్ వర్మ… నా ‘సర్కార్’ తన అసలైన రూట్ కొచ్చారు. నటన… ఆల్ ది బెస్ట్ సర్కార్… డామ్… ఇంకో పోటీ నాకు” అని ట్వీట్ చేశారు బిగ్ బీ.

ఈ చిత్రాన్ని ఆర్జీవీ గన్‌ షాట్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో వర్మ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్మ, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. “కోబ్రా” సినిమా మొత్తం నయీం చుట్టూ తిరగబోతందని తెలుస్తోంది.

Related posts