telugu navyamedia
సినిమా వార్తలు

నిక్ ఇలా చేస్తాడనుకోలేదు : ప్రియాంక చోప్రా

Priyanka-and-Nick

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గతేడాది హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నిరోజుల క్రితం ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఈ జంట తమ బిజీ లైఫ్ తో, మధ్యలో ట్రిప్ లతో హ్యాపీగా గడుపుతున్నారు. తాజాగా న్యూయార్క్ లో జరిగిన 10వ అంతర్జాతీయ మహిళా వార్షికోత్సవ సదస్సులో యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ప్రియాంక హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రియాంక సంస్కృతి సంప్రదాయాలు, శరణార్ధి క్యాంపులలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిక్ గురించి ప్రియాంక చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పెళ్లికి రెండేళ్ల ముందు నుండే నిక్ తనకు తెలుసనని, కానీ అతడిని పెళ్లి చేసుకుంటానని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని.. నిక్ విషయంలో తన అంచనా తప్పిందని చెప్పింది. నిక్ తో ప్రయాణం మొదలుపెట్టాక అతడి గురించి ఎంత తప్పుగా ఆలోచించానో తెలుసుకున్నానని తెలిపింది. అన్ని విషయాల్లో అండగా నిలిచే భర్త దొరికాడని, తనకు ఎప్పుడు ఏం కావాలో చెప్పకుండా అర్ధం చేసుకుంటాడని చెప్పుకొచ్చింది. చిన్నపిల్లలా తనేం కావాలని గొడవ చేసినా… ఎక్కడున్నా తీసుకువచ్చి తన ముందు పెడతాడని నిక్ వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియజేసింది.

Related posts