telugu navyamedia
సినిమా వార్తలు

ఫిట్నెస్ కాపాడుకోకపోతే ప్రేక్షకులు చూడరు… సల్మాన్ ఖాన్

Salman-KHan

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో “ద‌బాంగ్-3” చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో క‌న్నడ హీరో సుదీప్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కాగా… సల్మాన్‌ ఖాన్‌ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో మనకు తలియంది కాదు. తన ఫిట్‌నెస్‌, ఆటిట్యూడ్‌తో అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న సల్మాన్‌ బాలీవుడ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐఫా(ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ)-2019 ఉత్సవాల్లో సందడి చేయనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సల్మాన్‌ గత 30 సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న ప్రేక్షక దేవుళ్ల కోసం అనునిత్యం కష్టపడుతూనే ఉన్నాను. ఫిట్‌నెస్‌ కాపాడకోకపోతే ప్రేక్షకులు చూడరన్నారు. సినమాల్లో, టీవీల్లో, ఇతరాత్రా ఫంక్షన్లలో నిత్యం నన్ను చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్లను ఎప్పటికీ నిరాశపర్చను. 1989లో విడుదలైన ‘మై నే ప్యార్‌ కియా’ నుంచి ఇప్పటికీ తన లుక్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ముప్పై సంవత్సరాల్లో సల్లూ, సాలే, భాయ్‌, భాయ్‌జాన్‌గా నన్ను అభిమానులు పిలుచుకుంటారని అన్నారు. నా ఈ ఎదుగుదలకు కారణం నా అభిమానుల ప్రోత్సాహమే కారణమన్నారు. కాగా, సెప్టెంబర్‌ 18న జరగనున్న ఐఫా ఉత్సవాల్లో సల్మాన్‌తో పాటు రన్వీర్‌ సింగ్‌, విక్కీ కౌషల్‌, మాధురీ దీక్షిత్‌, కత్రినా కైఫ్‌, సారా అలీ ఖాన్‌ తమ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను వినోద పరుస్తారు. ఈ కార్యక్రమానికి అర్జున్‌ కపూర్‌, ఆయుష్మాన్‌ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు.

Related posts