telugu navyamedia
సినిమా వార్తలు

వార్ : అద్భుతమైన డ్యాన్స్… దానితోనే గాయాలపాలైన హీరోయిన్

War

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వార్”. ఈ చిత్రంలో వాణీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుద‌ల కానుంది. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లోని హృతిక్, టైగర్ స్టంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. ఇటీవల విడుదలైన ట్రైల‌ర్ లోని సీన్స్ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేశాయి. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో ప్రత్యేక సరళిని అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్ కి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. ఈసారి చిత్ర యూనిట్ వాణికపూర్ డాన్స్, గ్లామర్ షో గురించి వివరించారు. ఈ చిత్రంలో భారీ హంగులతో హృతిక్, వాణి కపూర్ మధ్య పార్టీ సాంగ్ ని తెరకెక్కించారు. ఈ సాంగ్ లో వాణి కష్టం వెండితెరపై కనిపిస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. తన అందాలతో ఆకట్టుకుంటూనే మతిపోగోట్టే విధంగా డాన్స్ చేసిందని సిద్దార్థ్ వివరించారు. ఈ సాంగ్ లో వాణికపూర్ పోల్ డాన్స్, వీల్ డాన్స్ విన్యాసాలు అద్భుతంగా ఉంటాయట. ముఖ్యంగా పోల్ డాన్స్ పర్ఫెక్ట్ గా చేయడం కోసం వాణి కపూర్ దాదాపు మూడు నెలలు శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. చాలా సందర్భాల్లో వాణి కపూర్ గాయాలపాలైంది. కొన్ని రిస్కీ డాన్స్ మూవ్స్ లో బాడీ డబుల్ ఉపయోగిస్తే బావుంటుందని సూచించినా నిరాకరించింది. సొంతంగానే కష్టపడి అద్భుతంగా డాన్స్ చేసింది అని సిద్దార్థ్ ఆనంద్ ప్రశంసించారు. ఈ చిత్రంలో హృతిక్, వాణి కపూర్ మధ్య రొమాన్స్ ప్రేక్షకులని కట్టిపడేయడం ఖాయమట. ఇటీవల విడుదల చేసిన సాంగ్ లో వాణి కపూర్ బికినిలో సైతం అందాలు ఆరబోసింది.

Related posts