telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోలు సర్జరీలు చేయించుకోరు అనుకుంటున్నారా ?… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్లు ప్లాస్టక్ సర్జరీలు చేయించుకుంటారు అన్నది వాస్తవమే. ఈ విషయాన్ని ఎందరో హీరోయిన్లు నిర్మొహమాటంగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు. అయితే, హీరోయిన్లే కాదు హీరోలు కూడా ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్‌లు చేయించుకుంటారని అంటున్నారు బాలీవుడ్ నటి రవీనా టాండన్. కరీనా కపూర్ హోస్ట్ చేస్తున్న రేడియో షోలో రవీనా పాల్గొన్నారు. ‘‘ఎవరైనా హీరోయిన్ సర్జరీ చేయించుకోగానే మీడియా తెగ ఫోకస్ చేసేస్తుంది. ఆమె సర్జరీ చేయించుకుంది, బొటాక్స్ వేయించకుంది అని రాసేస్తుంటారు. అసలు వీళ్లు ఏమనుకుంటారు? హీరోలు ఇలాంటివి చేయించుకోరు అనుకుంటారా? హీరోలు కూడా సర్జరీలు చేయించుకుంటారు. అలాంటప్పుడు హీరోయిన్ల వైపే ఎందుకు వేలెత్తి చూపుతారు. మన హీరోలు ఎప్పటికీ యవ్వనంగా ఉండటానికి ఏదైనా కనుక్కున్నారా. హీరోయిన్లకు తెలీని పానీయాలు లాంటివి హీరోలు తాగి అందంగా కనిపిస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు వీళ్లు? అందుకే ఇలా ఆలోచించేవారిని ఉద్దేశించి ఓసారి నేను పంచ్ వేసాను. ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాకు సీక్వెల్ తీస్తే అందులో కూడా హీరోలు సల్మాన్, ఆమిర్ మాత్రమే ఉంటారు కానీ హీరోయిన్లుగా మాత్రం 21 ఏళ్ల వాళ్లని పెడ్తారు అని. అది నిజమే. సినిమా తీస్తే మాత్రం ఓపెనింగ్ సీన్‌లో నాది, కరిష్మాది ఫొటోలు మాత్రం ఉంటాయి. ఆ ఫొటోలకు సల్మాన్, ఆమిర్ దండం పెట్టి యంగ్ హీరోయిన్స్‌తో సినిమా చేస్తారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసారు రవీనా.

Related posts