సామజిక మాధ్యమాలలో ఎప్పుడు ఏదో ఒక ట్రెండ్ కొనసాగుతుంటుంది. ఇలా కొద్ది రోజుల క్రితం బాటిల్ క్యాప్ చాలెంజ్ సోషల్ మీడీయాలో కొద్ది రోజుల పాటు ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే… దీంతో క్యాప్ ఛాలెంజ్‌లో పలువురు సిని ప్రముఖులతోపాటు పలువురు సెలబ్రెటిలు, క్రిడాకారులు, ఇందులో పాల్గోని ఇతరులకు చాలెంజ్ విసిరారు. ఇక ఇప్పుడు మరో క్యాప్ చాలెంజ్ సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.అది కూడ క్యాప్ చాలెంజ్ కాని అది ముసళ్లతో కొనసాగుతోంది. మనుష్యులు చేస్తే అందులో వింత ఎముంది అనుకున్నారో ఏమో క్యాప్ చాలెంజ్‌ను ముసళ్లతో చేయించారు.
ఆర్లాండోలోని థీమ్ పార్క్ గేటర్‌ల్యాండ్‌కు చెందిన కొన్ని మొసళ్లకు సంబంధించిన బాటిల్ క్యాప్ ఛాలెంజ్ వీడియోలు బాగా వైరలవుతున్నాయి. పార్క్ సిబ్బంది బాటిల్‌ను పట్టుకుని ఉండగా నీళ్లలో ఉన్న మొసళ్లు క్యాప్‌ను వాటి తోకతో కొడుతున్నాయి. ఇలా కొన్ని మొసళ్లు బాటిల్ క్యాప్‌ను కిందపడేయగా మరికొన్ని అలా చేయలేకపోయాయి. కొన్ని మాత్రం పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించాయి. రానురాను ఇలాంటీ సోషల్ మీడీయా ట్రెండింగ్‌లు వింత వింత చాలెంజ్‌లతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడీమాలో క్రేజ్ సాధించడం కోసం లక్షలాదీ మంది తమ ప్రతిభను బయటకు తీస్తున్నారు. దీంతో ఆ వీడీయోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా కొంతమంది సోషల్ మీడీయాలో పాపులారిటి కోసం సహాసాలు చేస్తుంటే మరికొంతమంది డబ్బు సంపాదన కోసం కూడ వీడీయోలు తీయటం పెద్ద ఎత్తున కొనసాగుతోంది.
ఏపీకి కేంద్రం నుంచి సహకారం: కన్నా