telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నవంబర్ 9 నుండి తిరిగి సెట్స్ పైకి ‘ఆచార్య’…

Aacharya

కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలై విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అందాల చందమామ కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ మధ్య సినిమా షూటింగ్స్ అన్నీ తిరిగి స్టార్ట్ అవుతున్నప్పటికీ ‘ఆచార్య’ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారనే దానిపై క్లారిటీ రాలేదు.ఇక ఈ సినిమాపై కొన్ని రూమర్స్ ఫిలిం నగర్ లో చక్కర్లుకొడుతున్నాయి. కొరటాల శివ ‘ఆచార్య’ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడని.. అందుకే షూటింగ్ లేట్ అవుతోందని.. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు అన్నాయి అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ”లాక్ డౌన్ తర్వాత మేము అన్ని భద్రతా జాగ్రత్తలతో నవంబర్ 9 నుండి తిరిగి సెట్స్ పైకి రావడానికి సంతోషిస్తున్నాము. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో సినిమాలోని ఎక్కువ భాగం షూటింగ్ పూర్తవుతుంది” అని ‘ఆచార్య’ మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Related posts