telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీకేం పోయేకాలం… బాహుబలి తరువాతే కదరా మీరిద్దరూ… హీరోలపై తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు

Thammareddy

ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాల విడుదల సమయంలో ఇద్దరు హీరోల మధ్యలో యుద్ధ వాతావరణం కన్పించింది. విచిత్రంగా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అంటూ అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు రెండూ పోటీ పోటీగా పోస్టర్స్ వదలిపోట్టడంతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ పోస్టర్స్ టాలీవుడ్‌లో పెద్ద జోక్‌గా మారాయి. ఈ తరుణంలో సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి వినూత్నంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ యూట్యూబ్‌లో వీడియో వదిలిపెట్టారు. ఈసారి కొత్తగా ఎక్స్‌పర్‌మెంట్ చేశా అంటూ.. మహేష్ బాబు, బన్నీ మాస్క్‌లో సినిమా చూపించారు తమ్మారెడ్డి. ఇద్దరు హీరోల మాస్క్‌లను చేతులకు పెట్టుకుని భజన చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు తమ్మారెడ్డి. ఆయన మాట్లాడుతూ..‘మా హీరో సూపర్ మాదే ఆల్ టైం రికార్డ్.. మేమే సూపర్ మా సినిమానే సూపర్.. బాహుబలి నెంబర్ బాహుబలి తరువాతే మేం.. మీరు ఎందుకు రా కొట్టుకుంటారు. బాహుబలి తరువాతే కదరా మీరిద్దరూ.. బాహుబలిని దాటిన రోజున మీ ఇద్దరు రికార్డుల్ని చెప్పిండి. రెండు సినిమాలు సూపర్ హిట్ కదా.. సూపర్ హిట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి కదా.. కలిసి ఉండొచ్చు కదా.. ఇద్దరు హీరోలు బాగున్నారు. మీకేం పోయేకాలం ఎందుకు ఇలా గొడవ చేస్తారు’ అంటూ బన్నీ, మహేష్ మాస్క్‌లతో సినిమా కలెక్షన్లపై సినిమా చూపించేశారు తమ్మారెడ్డి. కాగా ఇదే వీడియోలో ఏపీ రాజధాని ఇష్యూపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు తమ్మారెడ్డి. కొత్తగా మూడు రాజధానుల నిర్ణయం ఆర్ధిక భారం అంటూ పునరాలోచించాలని కోరారు. ఇక ఈ వీడియోపై భిన్న స్పందనలు వస్తున్నాయి నెటిజన్ల నుండి. ఎక్కువ శాతం మంది తమ్మారెడ్డి వాదనకు మద్దతు పలకడం విశేషం.

Related posts