telugu navyamedia
సినిమా వార్తలు

థియేటర్‌లో ఫ్యాన్స్‌పై పేపర్లు విసురుతూ రచ్చ చేసిన ఉపాసన.. వీడియో వైరల్

గత నాలుగేళ్లుగా సినీ అభిమానులకు ఊరిస్తూ వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. ఇప్ప‌టికే చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడడంతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

ఎన్టీఆర్, తారక్ అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాకు క్యూలు కడుతున్నారు

ఈ క్రమంలో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సైతం థియేటర్‌కు వెళ్లి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చూసింది. అంతేకాదు, పేపర్లు చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. నాటు నాటు సాంగ్‌కు కేకలు పెడుతున్న ఫ్యాన్స్‌పైనా పేపర్లు చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా, వీరితో పాటు ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు

Related posts