telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

యువతిపై గ్యాంగ్ రేప్… కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి…

Girl

విశాఖ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం కైలాసగిరి కొండపై యువతిపై అత్యాచారం కలకలం రేపింది. సుమారు 22 ఏళ్ల యువతిని ఓ బాలుడు కైలాసగిరి కొండపైకి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ కొద్దిసేపు అటూ ఇటూ సరదాగా తిరిగారు. అనంతరం ఓ ప్రదేశంలో కూర్చున్నారు. ఇంతలో ఆ బాలుడు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తీసుకొచ్చి యువతికి ఇచ్చాడు. అందులో మత్తుమందు కలిపిన విషయం తెలియని యువతి కూల్‌డ్రింక్ తాగడంతో మత్తులోకి జారుకుంది. యువతి స్పృహ‌ కోల్పోవడంతో బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత తన ముగ్గురు స్నేహితులను రప్పించాడు. ఆ ముగ్గురు కూడా యువతిని అత్యాచారం చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు కాగా మరో యువకుడు గురివిల్లి రమణ అత్యాచారానికి పాల్పడిన వారిలో ఉన్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా అటుగా వెళ్లిన పోలీసులకు బాలురపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విషయం తెలుసుకుని అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించారు. నిందితులు నలుగురిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. వారంతా నగరానికి సమీపంలోని జోడుగుళ్లపాలేనికి చెందినవారుగా తెలుస్తోంది.

Related posts