telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రేపటి పార్లమెంట్ కోసం నేడు .. ప్రధాని సమావేశం..

modi first cabinet with crew of 58

నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన తొలిసారి అన్ని పక్షాల నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మీటింగ్‌లో పార్లమెంట్ సమావేశాలు గురించి నిశితంగా చర్చించనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మోదీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ సమావేశం పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది. మొదటి రెండ్రోజులు లోక్‌సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ నెల 19న స్పీకర ఎన్నిక ఉంటుందని సమాచారం.

ఈ నెల 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసగించనున్నారు. జూలై 05న కేంద్ర బడ్జెట్‌ను మోదీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. రేపు(జూన్ 17) నుండి జూలై 26వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. నేటి ఉదయం 11గంటలకు అఖిలపక్ష సమావేశం ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల వరకు జరిగే అవకాశముంది. కాగా ఈ సమావేశానికి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి కేశవరావు, నామ నాగేశ్వరరావు.. టీడీపీ నుంచి గల్లా జయదేవ్,రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు.

Related posts