telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సచివాలయం కూల్చివేత కవరేజీ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ

high court on new building in telangana

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత కవరేజ్‌కి మీడియాకు అనుమతివ్వాలంటూ తెలుగు న్యూస్‌ ఛానెల్ వీ6, వార్తా పత్రిక ‘వెలుగు’ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. భవనాల కూల్చివేతలో ప్రభుత్వం గోప్యత పాటిస్తుందని పిటిషనర్‌కు కోర్టుకు తెలిపారు. సచివాలయం కూల్చివేతలో అసలు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసార మాద్యమాల్లో వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని పిటిషనర్ పేర్కొన్నారు. దీనికి స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వం ఎందుకు మీడియాను అనుమతించడం లేదని ప్రశ్నించింది.

కూల్చివేతల సందర్భంగా సచివాలయ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని, కూల్చివేతల సమయంలో ప్రమాదాలు జరుగుతాయనే ఎవ్వరినీ అనుమతించడం లేదని హైకోర్టుకు ఏజీ వివరించారు. కాగా, ప్రభుత్వమే వీడియోలు, ఫోటోలు తీసి పంపించడం సాధ్యం కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది. నిషేధిత ప్రాంతాలు మినహా మీడియాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుందని హైకోర్టు తెలిపింది. ప్రతిరోజు కూల్చివేత వివరాలపై బులిటెన్ ఇచ్చినా సరిపోతుంది కదా? అని ప్రశ్నించింది. ఈ విషయంపై ప్రభుత్వాన్ని అడిగి చెబుతామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. అనంతరం విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Related posts