telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : … 285 రన్స్ చేసిన ఆస్ట్రేలియా..

australia scored 285 runs on england today match

ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (100) క్రీజులో ఉన్నంతసేపు 340 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపించిన ఆసీస్, ఫించ్ అవుట్ కాగానే పరుగులు తీయడానికి ఆపసోపాలు పడింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ఎవరూ నిలదొక్కుకోకపోవడంతో కనీసం 300 పరుగుల మార్కు కూడా చేరుకోలేకపోయింది.

మ్యాక్స్ వెల్, స్టొయినిస్ నిరాశపరచటంతో పాటుగా స్మిత్ 38 పరుగులు చేసినా బ్యాట్ ఝుళిపించే సమయంలో అవుట్ కావడంతో ఆసీస్ భారీ స్కోరు ఆశలకు బ్రేక్ పడింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 27 బంతుల్లో 38 పరుగులు చేయడంతో కంగారూలకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేసి ఆసీస్ ను కట్టడిచేశారు. వోక్స్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్, వుడ్, స్టోక్స్, అలీ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ఆసీస్ పై ఒత్తిడి పెంచారు.

Related posts