సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన నాటి టీడీపీ సర్కారు చివరికి పసుపు-కుంకుమతో సరిపెట్టిందని అన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డ్వాక్రా మహిళల్లో సంతోషాన్ని నింపుతున్నారని పేర్కొన్నారు. తేదీలు ముందే చెప్పి, పేదలకు లబ్ది చేకూర్చే పథకాలను జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. డ్వాక్రా మహిళల రుణాలను నాలుగు విడతల్లో రద్దు చేస్తామన్న హామీని త్వరలో అమలు చేయనున్నారని తెలిపారు.
వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు: కన్నా