telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మూడో రోజు ముగిసిన ఆట.. భారత్ 257/6

భారత్-ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో మూడో రోజు ఆట ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 555/8 తో ఉన్న ఇంగ్లాండ్ ను నేడు ఆట ప్రారంభమైన తర్వాత భారత్ ఆల్ ఔట్ చేయి తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆర్చర్ మొదట్లోనే రోహిత్(6) ఔట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ గిల్(29) కూడా ఆర్చర్ పెవిలియన్ కు చేర్చగా కోహ్లీ(11), రహానే(1) లను వెనక్కి పంపించి డోమ్ బెస్ భారత్ ను కష్టాలో నెట్టాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పంత్ తో కలిసి పుజారా నిలకడగా రాణించి 5వ వికెట్ కు 119 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. కానీ  73 పరుగుల వ్యక్తిగత  స్కోర్ వద్ద పుజారా క్యాచ్ రూపంలో పెవిలియన్ కు చేరుకోగా కాసేపటికే 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ ఔట్ అయ్యాడు. దాంతో తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సుందర్(33), అశ్విన్(8) జాగ్రత్త ఆడుతూ ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. దాంతో ఆట చివరి సమయానికి 6 వికెట్లు కోల్పోయిన టీం ఇండియా 257 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ కంటే ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది భారత్. చూడాలి మరి రేపటి ఆటలో ఏం జరుగుతుంది అనేది.

Related posts