telugu navyamedia
సినిమా వార్తలు

మీకు అధికారం ఇచ్చింది మా నెత్తి మీద కూర్చొడానికి కాదు- వ‌ర్మ‌

చిత్ర‌ప‌రిశ్ర‌మకు, ఏపీ ప్రభుత్వానికి మ‌ధ్య‌ మాటల యుద్ధం కొనసాగుతుంది. సినిమా టికెట్స్ ధరలు తగ్గించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొంద‌రు బ‌హిరంగంగా విమ‌ర్శిస్తే.. మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో, ఛానెల్స్‌లో ఏపీ ప్ర‌భుత్వ తీరుని త‌ప్పు ప‌డుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించాలని.. పెద్ద సినిమాలు దారుణంగా నష్టపోతాయంటూ ప్రొడ్యుసర్స్ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేదంటుంది.

ఈ ఇష్యూపై ద‌ర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటుగా అయినా లేటెస్ట్‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి.. రామ్ గోపాల్ వర్మకు మధ్య గత రెండు మూడ్రోజుల నుంచి మాటల యుద్ధం నడుస్తోంది.

RGV starts direct attack on Perni Nani and AP Govt | Tupaki English

తాజాగా ఈరోజు మరోసారి టికెట్ రేట్స్ ఇష్యూపై వర్మ ట్విట్టర్ ఖాతాలో వరుస ట్విట్స్ చేస్తున్నారు. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి సార్ ? అంటూ వర్మ ప్రశ్నించారు.

హీరోల రెమ్యూనరేషన్‌ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడి పైనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఖర్చు, రాబడి విషయాన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలన్నారు.

గోధుమలు, బియ్యం, కిరోసిన్ నూనె మొదలైన నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని సమతౌల్యత కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ధరను నిర్ణయించవచ్చని నేను అర్థం చేసుకున్నాను, అయితే అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది సర్? ఆర్జీవీ ప్రశ్నించారు.

పేదలకు సినిమా చాలా అవసరమని మీకు అనిపిస్తే, మీరు ప్రభుత్వ జేబులోంచి బ్యాలెన్స్ చెల్లించి వైద్య, విద్యా సేవలకు ఎలా రాయితీ ఇస్తున్నారో ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వదు సార్?

ఆహార ధాన్యాలలో కూడా బలవంతంగా ధర తగ్గించడం వల్ల రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారు, తద్వారా కొరత ఏర్పడి నాణ్యత లోపిస్తుంది, అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది సర్.

బియ్యం, పంచదార మొదలైన వాటిని పేదలకు అందించడానికి రేషన్ షాపులు సృష్టించబడ్డాయి, మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా సార్?

నిర్ధిష్ట పరిస్థితుల్లో సమతౌల్యత కంటే దిగువన లేదా అంతకంటే ఎక్కువ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత సినిమా పరిశ్రమలో మీరు ఏ ప్రత్యేక పరిస్థితిని గుర్తించారు సార్?

సినిమా టికెట్స్ పేదవారికి తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశం మీకుంటే కొన్ని టికెట్స్ ప్రభుత్వం తరపున కొనండి. అవి నేరుగా పేదవారికి తక్కువ ధరకు ఇవ్వండి. అప్పుడు నిర్మాతలుగా మా డబ్బులు మాకొస్తాయి. మీ ఓట్లు మీకు పడతాయ‌ని అన్నారు.

ఆర్థిక వేత్త ఆడమ్ స్మిత్ సైతం ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ అనర్ధాలకు దారితీస్తుందని చెప్పారు.

అల్లుఅర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు  రెమ్యునరేషన్ అనేది వారి సినిమా ప్రొడక్షన్‌కి అయ్యే ఖర్చు, రాబడిని బట్టే నిర్ణయింపబడుతుంది. మీరు స‌పోర్ట్ చేయ‌డం మానేసి మా నెత్తి మీద కుర్చుంటున్నారని సెటైర్లు వేశారు.

మీ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి నుండి మద్దతు ఇచ్చే అధికారం ఇచ్చారని, మా తలపై కూర్చోవడానికి కాదని మీరు అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాను .. చేతులు జోడించి చాలా ధన్యవాదాలు అంటూ వర్మ కౌంటర్ వేసాడు.

టిక్కెట్టు రేట్ల విషయంలో  ఇది నా ఒక్క‌డి రిక్వెస్ట్‌ కాదు..ఇది నా డిమాండ్‌.. సినీ పరిశ్రమలో నాతో పని చేస్తున్న వారందరూ నిజమైన ఫీలింగ్స్ ..ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికి తెరవాలేరు.. .తార్వాత మీ ఖర్మ..

Related posts