గుర్తుతెలియని వ్యక్తులు ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోజ్ చెన్నాపై దాడికి పాల్పడ్డారు. భువనేశ్వర్ నుంచి అసిక వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. బ్రహ్మపుర బైపాస్ రోడ్ లో మనోజ్ వెళ్తుండగా వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు.
అనంతరం, మనోజ్ పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయారు. మనోజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గంజాం జిల్లా అసిక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.