ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ట్వీట్ చేశారు. నాపై పెట్టిన ఈ బాధ్యతను నేను నిబద్ధతతో నిర్వహిస్తానని అన్నారు. పార్టీని జిల్లా, మండల, గ్రామ బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీలో అందరిని కలుపుకుంటూ పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు తనకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి , ప్రధానమంత్రి మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీఎల్ సంతోష్ గారికి మరియు మన కేంద్ర నాయకత్వంలోని ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.