telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసుపత్రిలో సంజన రచ్చ… బ్లడ్ టెస్ట్ చేయించుకోనంటూ మొండిపట్టు…!

Sanjana

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇష్యూలో క‌న్న‌డ న‌టి రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అసిస్టెంట్ రాహుల్‌‌, హీరోయిన్ సంజనా గల్రానీ, ప్రభుత్వ ఉద్యోగి రవిశంకర్, వీరేన్ ఖన్నా తదితరులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) ఈ కేసు విచారణ చేస్తున్నారు. నటి రాగిణి, సంజనా డ్రగ్స్ సేవించామని అంగీకరించారని ఇటీవల పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా సంజన సీక్రెట్ మ్యారేజ్ వ్యవహారం బయటపడడం చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరుకు చెందిన డాక్టర్ అజీజ్ పాషాను సంజన వివాహం చేసుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రాగిణి ద్వివేది, సంజనాలకు రక్త పరీక్షలు చేసి వారి అసలు బండారం బయటకు తియ్యడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడ సంజన తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని, ప్రజలు, మీడియా ముందు నన్ను బకరాను చేసి ఆడుకుంటున్నారు. నేను రక్తపరీక్షలు చేసుకోను, రక్త పరీక్షలు చేసినా అది నా రక్తమే అనడానికి గ్యారెంటీ, సాక్షాలు ఏమిటి ? నాకు ఎవ్వరిమీద నమ్మకం లేదు అంటూ నటి సంజనా ఆసుపత్రిలో నానా రచ్చ చేసింది.

Related posts