telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ ఆర్ ఆర్ నుంచి ‘దోస్తీ’ సాంగ్ విడుదల..

యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్​, మెగా ప‌వ‌ర్ రామ్​చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఆర్​ఆర్​ఆర్’. అల్లూరి సీతారామరాజు (నిప్పు) పాత్రలో రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌ (నీరు)గా తారక్‌ నట విశ్వరూపం చూపించారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ నటించారు

RRR: Makers of Jr NTR-Ram Charan starrer share an exciting update about the  film and it will make all movie buffs jump with joy

మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ సినిమా పాత రికార్డ్స్‌ను బ్రే క్ చేస్తూ కేక పెట్టిస్తోంది .అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వ‌సూలు చేసింది.

Thumbnail image

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎత్తర జెండా, నాటు నాటు, కొమ్మ ఉయ్యాల వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టిస్తోండగా.. తాజాగా దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, చరణ్ ల స్నేహ బంధాన్ని వివరిస్తూ తెరకెక్కిన దోస్తీ సాంగ్ వైరల్ గా మారింది. 

Jr NTR, Ram Charan's 'RRR' release delayed again due to pandemic? | Telugu  Movie News - Times of India

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన తీరు అందరినీ ఆకర్షించేలా ఉంది. విభిన్న ధృవాల మధ్య స్నేహం గురించి వివరించే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా హేమచంద్ర పాడారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు.

 

Related posts