telugu navyamedia
సినిమా వార్తలు

నటుడు, నిర్మాతపై రేప్ కేసు నమోదు

Kangana-and-Aditya-pancholi

పదమూడేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలి తనను మానసికంగా, లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదిత్య ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇద్దరి మధ్యా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదిత్య పంచోలిపై ముంబై వెర్సోవా పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదైంది. కంగనా రనౌత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదిత్యా పంచోలిపై ఐపీసీ సెక్షన్ 376, 328, 384, 341, 342, 323, 506ల కింద కేసులు నమోదు చేశారు. ఆదిత్యా పంచోలి గతంలో కంగనా రనౌత్‌పై వేధింపులకు పాల్పడ్డాడని, కంగనా సోదరి రంగోలీ వెర్సోవా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కంగనా తరపు లాయర్ తనను అత్యాచార కేసులో ఇరికిస్తానని తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని మరోవైపు ఆదిత్యా పంచోలి కూడా పీఎస్‌లో గతంలో కౌంటర్ అప్లికేషన్ దాఖలు చేశాడు. కొన్నాళ్లుగా కంగనా రనౌత్, ఆదిత్యాపంచోలీ మధ్య వివాదం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది, మరి ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.

Related posts