telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డైరెక్టర్ గా మారిన హీరోయిన్… ఆ షార్ట్ ఫిలింకు సర్వత్రా ప్రశంసల జల్లు..!

Ramya

రమ్యా నంబీషన్ తెలుగులో “పిజ్జా”… ఇంకా రెండు, మూడు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ భామ ఇక్కడ పెద్దగా క్లిక్ కాలేకపోయింది. అయితే తమిళం, మలయాళంలో మాత్రం రమ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే రమ్య నంబీషన్ ఎన్‌కోర్ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రారంభించిన ఈ హీరోయిన్ తాజాగా దర్శకురాలిగా తన ప్రతిభను బయటపెట్టింది రమ్య.‘అన్‌ హైడ్’ పేరుతో రమ్య తీసిన షార్ట్ ఫిలిం తాజాగా విడుదలైంది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ షార్ట్ ఫిలింలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించడంతో పాటు.. పురుషులు ఎలా ఉండాలో కూడా వివరించింది. ఇక ఈ లఘు చిత్రానికి భద్రీ వెంకటేష్ డైలాగ్‌లు రాయగా.. రమ్య సోదరుడు రాహుల్ సుబ్రమణ్యం సంగీతం అందించారు. ఈ షార్ట్‌ ఫిలింలో రమ్య, శ్రిత శివదాస్ నటించారు. ప్రస్తుతం ఈ లఘు చిత్రంలో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుండగా.. సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ లఘు చిత్రం ఇచ్చిన ఊపుతో రమ్య భవిష్యత్‌లో ఓ చిత్రాన్ని తెరకెక్కించినా ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు.

Related posts