telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ 13 రిజల్ట్ పై సల్మాన్ గరం… షోకు గుడ్ బై…!?

Siddharth

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ 13 ముగిసింది. బిగ్ బాస్-13 లో సిద్దార్థ్ శుక్లా విజేతగా నిలవగా, అసిమ్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. షెహ్నాజ్ గిల్ మూడవ స్థానంలో ఉండగా… రాషమి దేశాయ్, ఆర్తి సింగ్ నాల్గవ స్థానంలో నిలిచారు. పరాస్ ఛబ్రా 10 లక్షల మనీ బ్యాగ్‌తో షో నుండి బయటకు వెళ్లి ఆరో స్థానంలో నిలిచాడు. బిగ్ బాస్ 13 అక్టోబర్ 2019 లో ప్రారంభమై.. ఫిబ్రవరి మధ్యలో ముగిసింది. షోను మరో రెండు వారాల పాటు పొడిగించాలనుకున్నప్పటికి, సల్మాన్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో మేనేజ్‌మెంట్ ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అయితే సిద్ధార్థ్ శుక్లాను విజేతగా ప్రకటించడంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వీకెండ్ కా వార్ ఎపిసోడ్ల సమయంలో శుక్లా పక్షాన ఛానెల్ వకాల్తా పుచ్చుకుందా అని సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాజాగా అందుతోన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ విజేతను ప్రకటించే సమయంలో.. ఛానెల్ సిద్దార్థ్ శుక్లాను రిఫర్ చేయడంతో సల్లూ భాయ్ కోపంతో ఊగిపోయారట. అందుకే విజేత ప్రకటన ఆలస్యమయి..అర్థరాత్రి అనౌన్స్ చేయాల్సి వచ్చిందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇకపై షోకు హోస్టుగా పనిచేయనని తేల్చి చెప్పాడట. ఈ వార్తలు కొత్త కాకపోయినప్పటికి..ఈ సీజన్‌ సల్మాన్‌పై కాస్తంత ప్రతికూలత చూపిందన్న మాట మాత్రం వాస్తవం.

Related posts