telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జనసేనలోను .. మొదలైన అసంతృప్తుల రాజీనామా రగడ.. !

janasena party leader resigned

నేడు జనసేన 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత అర్ధరాత్రి 32 మందితో కూడిన తొలిజాబితా ఆ పార్టీ విడుదల చేసింది. దీనితో ఆ పార్టీలో కూడా అభ్యర్థుల నుండి అసమ్మతి మొదలైంది. తమకు టికెట్ రాలేదని తొలిజాబితాలో సీటు దక్కని వారు మనోవ్యధకు గురిఅవుతున్నారు. దీనితో పార్టీ మారడం లాంటి వాటివైపు మళ్లుతున్నారు. ఇప్పటికే ఈ సమస్య ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ లలో ప్రారంభం అయ్యాయి. తాజాగా, జనసేనలో కూడా ప్రారంభం కావడం విశేషం. తనకు సీటు రాలేదని, పశ్చిమగోదావరి జిల్లా కోకన్వీనర్ యర్రా నవీన్ పార్టీకి రాజీనామా చేయడం అందరికి షాక్ కు గురి చేసింది. పార్టీలో కష్టపడినవారికి కాకుండా.. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కనివారు జనసేనలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ కీలక నేతలు నవీన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో ఐదో జనసేన ఆవిర్భావదినోత్సవ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ సభ నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబందించిన తొలి జాబితా సైతం పవన్ ప్రకటించారు. అసెంబ్లీకి పోటీ చేసే 32 మంది అభ్యర్థులు, లోక్‌సభకు పోటీ చేసే నలుగురు అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, పసుపులేటి బాలరాజు, శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ తదితరులున్నారు.

Related posts