telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సచివాలయంలో ఉద్యోగులకు .. డ్రెస్ కోడ్… ఇటీవల గెలిచిన నటుల దెబ్బ..

dress code in Secretariat

దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఆలయానికి రావాలని భక్తులను కోరుతున్నాయి. దేవుని సన్నిధిలో పాశ్చాత్య వస్త్రధారణ తగదని హితవు పలుకుతున్నాయి. ఇప్పుడు ఇదే బాటను అనుసరిస్తోంది తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది. మహిళలు చీర, లేదంటే దుపట్టాతో ఉన్న చుడీదార్, సల్వార్ కమీజ్ ధరించి కార్యాలయానికి రావాలని, పురుషులు ఫార్మల్ చొక్కాలు, ఫార్మల్ ప్యాంట్లు మాత్రమే ధరించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కార్యాలయ మర్యాదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు డ్రెస్‌కోడ్‌ను పాటించాలని అందులో కోరారు. కోర్టులు, ట్రైబ్యునల్‌, న్యాయ కమిటీ ఎదుట హాజరయ్యే పురుష ఉద్యోగులు తప్పనిసరిగా ట్రౌజర్లు, కోటు ధరించాలని, మహిళా ఉద్యోగులైతే చీర, దుపట్టాతో ఉన్న చుడీదార్ ధరించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమిళ సంప్రదాయ పరిరక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఫార్మల్‌గా కనిపించడం వల్ల ప్రజలు కూడా గౌరవిస్తారని పేర్కొన్నారు.

Related posts