telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉదయ్ కిరణ్ బయోపిక్ పై స్పందించిన సందీప్ కిషన్

Uday Kiran

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. కెరీర్ మొదట్లో లవర్ బాయ్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ వరుస హిట్లను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆయన. ఆయ‌న బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు కొన్నాళ్ళ నుండి వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్రం సినిమాతో ఉద‌య్ కిర‌ణ్‌ని వెండితెర‌కి ప‌రిచ‌యం చేసిన తేజ, బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తాడ‌ని అన్నారు. కాని అది రూమ‌ర్ అని తేజ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా ఉద‌య‌కిర‌ణ్ బ‌యోపిక్ మ‌ళ్లీ వార్త‌ల‌లోకి వ‌చ్చింది. ఓ షార్ట్ ఫిలిం మేక‌ర్ సందీప్ కిష‌న్‌తో ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అర్ధాంతరంగా మరణించిన యువ నటుడు ఉదయ్ కిరణ్ జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు, అందులో నటించడమే కాకుండా ఆ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్త వైరల్ కావడంతో తాజాగా సందీప్ కిషన్ స్పందించాడు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు. “ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో నేను నటిస్తున్నట్టు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నన్నెవరూ ఇంతవరకు సంప్రదించలేదు. ప్రస్తుతం బయోపిక్‌లు చేసే ఆలోచన నాకు లేదు” అని సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

Related posts