పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కర్నూలు ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కమర్షియల్ ఆపరేషన్ కు సిద్ధంగా ఉందని… కమర్షియల్ ఆపరేషన్ కు సంబంధించిన అనుమతుల గురించి కేంద్రంతో మాట్లాడానన్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని… భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన షిఫ్టింగ్, టెక్నికల్ అంశాలపై మాట్లాడామన్నారు. అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని… సివిల్ ఏవియేషన్ కు సంబంధించిన పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కూడా త్వరలోనే జరుగుతుందని.. టిడిపి నేతలు సబ్జెక్ట్ తెలిసీ, తెలియక మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఆర్భాటం, ఆత్రుత, అసమర్ధతతో వ్యవహరిస్తారని.. మాది సహనం తో కూడిన సమర్ధత కలిగిన ప్రభుత్వమని తెలిపారు. ప్రచారం చేసుకునే ప్రభుత్వం మాది కాదని… ప్రజలు పని జరిగిందా, లేదా…!? అని చూస్తారు తప్ప ఆర్భాటం కాదన్నారు. శంకుస్థాపన ల కోసం కాకుండా ప్రారంభోత్సవాలు చేయడమే మా లక్ష్యమని… ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు.
previous post