telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ బాబు కొత్త సినిమా పారితోషికం ఎంతంటే…?

Mahesh

మహేష్ బాబు సినిమా ప్రారంభం సమయంలో అడ్వాన్స్ తీసుకుని తన సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ లాభాల్లో వాటాను పంచుకోవడం గత కొంత కాలంగా చేస్తూ వస్తున్నాడు మహేశ్. అలా ఎలా చూసినా 50 కోట్లకు పైగానే గిట్టుబాటు అవుతూ వచ్చింది మహేష్‌ బాబుకి. నిజానికి మహేశ్ ఫైనాన్సియల్ డీలింగ్స్ అన్నీ బోంబేకి చెందిన ఓ ఏజెన్సీ చూస్తూ వస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ వంటి డీల్స్ కూడా వారే చూస్తుండేవారు. కానీ కరోనా వేవ్ తీవ్రంగా ఉండటంతో ఇప్పుడు ఏజెన్సీతో డీల్ కష్టతరంగా మారిందట. అందుకే డైరెక్ట్ గా పూర్తి స్థాయి పారితోషికం తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నాడట. అలా తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు రైట్స్, వాటాలు వంటివి లేకుండా ఇంత పారితోషికం అనే ఒప్పందం జరిగిందట. దాని ప్రకారం చూసుకున్నా గతంలో కంటే ఎక్కువే గిట్టుబాటు అవుతున్నట్లు సమాచారం. అలా ఈ తాజా సినిమాకు మహేష్ బాబు కు దాదాపు 60 కోట్లు అందనుందట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Related posts