telugu navyamedia
సినిమా వార్తలు

‘బంగార్రాజు’లో నాగలక్ష్మిగా కృతి శెట్టి…

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం లో నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ న‌టిస్తుండ‌గా.. అక్కినేని నాగ చైతన్య మరియు ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి లు కూడా నటిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవ‌ల విడుదైన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుండా’ పాట అభిమానులను ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బంగార్రాజు నుంచి కృతి లుక్‌ను నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. ఈ సినిమాల్లో ఆమె నాగలక్ష్మి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అచ్చమైన పల్లెటూరి పిల్లలా .. మెడలో పూల దండలతో ఉరేగింపులో జనాల మధ్య ఉన్న కృతి లుక్‌ ఆకట్టుకుంటోంది.ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చలపతి రావు.. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Related posts