telugu navyamedia
సినిమా వార్తలు

జయలలిత బయోపిక్ కోసం కంగనా కష్టాలు

Kangana

దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ “త‌లైవీ” అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంగనా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. సినిమాకు విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ‘ది డర్టీ పిక్చర్’ రచయిత రజత్ అరోరా కంబైన్డ్‌గా కథను రూపొందించారు. హిందీలో “జ‌య” టైటిల్‌తో విడుద‌ల కానున్న ఈ చిత్రం కోసం కంగ‌నా భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ని టాక్. “త‌లైవీ” సినిమాలో జ‌య‌ల‌లితగా క‌నిపించేందుకు కంగనా స‌న్నాహాలు చేసుకుంటుంది. ఇటీవ‌ల అమెరికాలోని లాంజ్ ఏంజెల్స్‌కి వెళ్లిన ఈ అమ్మ‌డు ప్ర‌ముఖ హాలీవుడ్ ఫేమ‌స్ ఆర్టిస్ట్‌ జేస‌న్ కోలిన్స్ ని క‌లిసింది. ఆయ‌న త‌న స్టూడియోలో కంగనాకి ప్రోస్తెటిక్ ట్రీట్మెంట్ చేశారు. కంగ‌నాని జ‌య‌ల‌లితగా చూపించ‌బోతున్నారు. అయితే ట్రీట్మెంట్ స‌మ‌యంలో తీసిన‌ ప్రోస్తెటిక్ మేక‌ప్ ఫోటోల‌ని కంగ‌నా సోష‌ల్ మీడియా సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జ‌య‌ల‌లిత బ‌యోపిక్ మైండ్ బ్లోయింగ్ అవుతుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. జేసన్ కాలిన్స్ గతంలో కెప్టెన్ మార్వెల్ సినిమా కోసం పని చేసేవార‌న్న విష‌యం కూడా వారు తెలిపారు.

Related posts