“ఝుమ్మందినాదం” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నటి తాప్సి పన్ను. ఆ తరువాత వరసగా టాప్ హీరోల సరసన నటించింది. బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది. ఒకవైపు తెలుగు సినిమాలు, మరోవైపు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది ఈ మిల్కీ బ్యూటీ. ఇక అప్పుడప్పుడు తాప్సి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ విషయమైనా కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడే స్వభావం తాప్సిది. ఇటీవల తాప్సి తన తాజా చిత్రం “బదలా” ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ సింగర్, నటుడు అలీ జాఫర్ కు తన మద్దతు తెలిపారు తాప్సి.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పీచ్ ను అలీ జాఫర్ మెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో అతనిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు నెటిజన్లు. ఈ విషయంపై తాప్సి స్పందిస్తూ “నాకో విషయం అర్థం కావడం లేదు. పాకిస్తాన్ వ్యక్తి ఇక్కడ ఉంటే వాళ్ళ దేశానికి మద్దతు పలకకూడదా ? అతనిపై బ్యాన్ విధించి మనం సంతోషపడుతున్నాము… నేను నా దేశానికి మద్దతు పలికితే పాక్ ప్రజలు నన్ను విమర్శిస్తారా ? అతను వాళ్ళ దేశానికి మద్దతు పలికినట్లుగానే… పుల్వామా దాడి తరువాత నేను నా దేశానికి మద్దతు పలికాను. అతను తన దేశానికి మద్దతు తెలపడంలో తప్పేంటి ?” అంటూ ప్రశ్నించింది తాప్సి.