telugu navyamedia
సినిమా వార్తలు

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా?

‘వరుడు కావలెను’ సినిమాను బ్యాన్‌ చేయాలని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ పై కేసు నమోదయింది. తాజాగా టాలీవుడ్ లో ‘దిగు దిగు నాగ’ అనే సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఈ పాటలను నాగదేవతకు కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారని ఆరోపిస్తున్నారు.

సాంగ్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సినిమా యూనిట్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఫిర్యాదు చేశారు. లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు

ఇక టాలీవుడ్ లో ఎన్నో గొప్ప పాటలను రాసిన అనంత్ శ్రీరామ్ పై ఇలాంటి ఆరోపణలు రావటంతో ఆయన ఎలా స్పందింస్తాడో చూడాలి. సంస్కృతి, సాంప్రదాయాలు, దేవుళ్లపై పాటలు రచించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు యూట్యూబ్ లో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కాగా..నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా “వరుడు కావలెను”. ఈ మూవీ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే సాంగ్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే..!

Related posts