telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 8 (ఆదివారం) రాశి ఫలాలు

మేషం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనం విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. రుణములు సన్నిహితుల సహాయంతో పూర్తిచేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్నిసందర్శిస్తారు.

వృషభం : ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మత్స్య, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం : కొత్త పనులు ప్రారంభిస్తారు. ఓపిక అవసరం. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, చికాకుల వల్ల ఆందోళనలకు గురవుతారు. నేడు మీరు ఆర్థిక లాభాలు ఆశించవచ్చు.ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్నారుల విద్యా విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కర్కాటకం : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. రవాణా రంగాల వారికి ఏకాగ్రత మెళకువ అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. గతంలో చేసిన పనులకు ఇపుడు ఫలితాలు కలుగుతాయి. కుటుంబం నుంచి అందరి మద్దతు పొందుతారు. ఇది మనస్సుకు సంతోషాన్నిస్తుంది.

సింహం : పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఖర్చులు తగ్గించుకోండి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి.

కన్య : కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. మనస్సు మాట విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది.

తుల : వ్యాపారం, స్వయం ఉపాధి రంగాలవారికి సమయం బాగుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పాత రుణములు కొన్నింటిని తీరుస్తారు. వృత్తి వ్యాపారాలకు సమస్యలెదురైనా ఆదాయానికి ఇబ్బంది ఉండదు.

వృశ్చికం : శుభకార్యాలు జరిపించడానికి కావాల్సిన ధనం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి అనుకూలం. రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది.

ధనస్సు : రాజకీయాల్లో వారు ఆందోళనకు గురవుతారు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ పట్టుదల నిదానంగా నెరవేరుతుంది. వ్యాపారులు పనివారల పట్ల జాగ్రత్త అవసరం. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మంచి కార్యక్రమాలను చేపడతారు. శుభకార్యాల, రియల్టర్లకు మంచి ఫలితాలు ఉంటాయి.

మకరం : ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మంచి ఆలోచనలతో ముందుకెళ్తారు. మానసిక ఉత్సాహం ఉంటుంది. స్త్రీలు శుభకార్యాల్లో పాల్గొంటారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలం. పత్రికా రంగంలోని వారికి పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానంతో అభిప్రాయభేదాలు వస్తాయి. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది.

కుంభం : బంధువుల రాకతో కొన్ని పనులు వాయిదాపడతాయి. దంపతులు మధ్య సఖ్యత నెలకొంటుంది. స్నేహితుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. సొంత వ్యాపారాలు లీజు, ఏజెన్సీల త్వరలో అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. వివాహ సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి

మీనం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధు మిత్రుల కోసం ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మెళకువ అవసరం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది.

Related posts