telugu navyamedia
ఆరోగ్యం

50-80 ఏళ్ల మధ్య వయసు వారికోసం

వయసు మీద పడుతోందా అయితే మీ కోసమే ఈ టిప్స్
50 నుంచి 80 ఏళ్ల మధ్య వయసుల వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచిది.
రెగ్యులర్‌గా పరిశీలించుకోవాల్సినవి:
1. బ్లడ్ ప్రెజర్,
2. బ్లడ్ షుగర్,
3. ట్రైగ్లిజరైడ్స్,
4. కొలెస్ట్రాల్,
5. యూరిక్ యాసిడ్
తక్కువ తీసుకోవాల్సినవి:
1. పంచదార,
2. ఉప్పు,
3. బ్లీచ్‌డ్ ప్లోర్,
4. పాల ఉత్పత్తులు,
5. నిల్వచేసిన ఆహారం,
6. మ్యాగీ ఫుడ్
తప్పనిసరిగా తీసుకోవాల్సినవి:
1. పండ్లు,
2. కూరగాయలు,
3. చిక్కుళ్లు,
4. బీన్స్,
5. నట్స్,
6. గుడ్లు,
7. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ (ఆలివ్, కోకోనట్)
ఈ మూడింటిని మరిచిపోండి:
1. మీ వయసు,
2. మీ గతం,
3. మీ ఫిర్యాదులు
ఈ మూడింటిని మరిచిపోకండి:
1. మీ స్నేహితులు,
2. మీ పాజిటివ్ ఆలోచనలు,
3. పరిశుభ్రమైన ఇల్లు
మూడు ప్రాథమిక విషయాలు:
1. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండటం,
2. ప్రతిరోజూ వ్యాయామం చేయడం,
3. బరువును నిత్యం చెక్‌చేసుకుంటూ అదుపులో ఉంచుకోవడం
7 ముఖ్యమైన విషయాలు:
1. దాహం వేసేవరకు నీళ్లు తాగకుండా వేచి ఉండొద్దు
2. నిద్ర వచ్చేంత వరకు నిద్రకు ఉపక్రమించకుండా ఉండొద్దు,
3. మీరు విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయేంత వరకు వేచి ఉండొద్దు
4. మీరు అనారోగ్యం బారిన పడేంత వరకు వైద్యపరీక్షల కోసం వేచి ఉండొద్దు
5. దేవుడిని నమ్మడానికి అద్భుతాలు జరిగే వరకూ వేచి ఉండొద్దు
6. మీపై మీరు ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు
7. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండండి, రేపటి మంచి కోసం ఆశించండి

Related posts