telugu navyamedia
వ్యాపార వార్తలు

ఏడాది కాలంలో అనూహ్య లాభాలు ఇచ్చిన షేర్

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగల అవకాశం కేవలం స్టాక్ మార్కెట్లోనే సాధ్యమంటున్నారు ఆర్థిక నిపుణులు. భారీ లాభాలను తెచ్చిపెట్టే స్టాక్‌లను ‘మల్టీ బ్యాగర్’ స్టాక్స్ అంటారు. మంచి పునాదులు ఉండి పెద్దగా ప్రాచుర్యం లేని కంపెనీలు కొన్నాళ్లకు భారీగా లాభాలు తెచ్చిపెడతాయి. 2021 సంవత్సరంలో అనూహ్యంగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. చిన్న తరహా షేర్లు, మిడ్ క్యాప్ షేర్లు బాగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. వీటిలో కొన్ని ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. కొన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించాయి.

ఏడాది కాలంలో ‘గీతా రెన్యువబుల్ ఎనర్జీ’ సంస్థ షేరు కూడా మల్టీ బ్యాగర్ కోవకు చెందినదిగా చెప్పుకోవచ్చు. ఏడాది కాలంలో ఈ స్టాక్ ధర విశేషంగా 4,600 శాతం పుంజుకుంది. ఏడాది క్రితం ఈ షేరు ధర రూ. 5.50 ఉండటం గమనార్హం. ఈ వారం స్టాక్ మార్కెట్ ముగింపు సమయానికి గీతా రెన్యువబుల్ షేర్ ధర 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ అయింది. గత 5 రోజుల్లో 21.50 శాతం పెరిగి రూ. 214 ఉన్న ఒక్కో షేరు రూ. 260కి పెరిగింది. నెలరోజుల వ్యవధిలో రూ. 93.60 నుంచి 175 శాతం పెరిగి రూ.260కి చేరింది. ఇలాంటి మల్టీబ్యాగర్‌ షేర్లను గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. స్టాక్‌ మార్కెట్‌పై మంచి పట్టున్నవారు కూడా వీటిని గుర్తించడంలో విఫలమవుతుంటారు.

Related posts