telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

లేచిపెడుతున్న .. స్టాక్ మార్కెట్లు…

husge loses again in stock markets

నేడు మార్కెట్లు ప్రారంభం నుండి లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. కానీ వెంటనే మళ్లీ నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 44 పాయింట్ల నష్టంతో 36,538 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,898 వద్ద ట్రేడవుతున్నాయి. నేడు ఆర్‌బీఐ పరపతి సమీక్ష సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్కెట్‌లో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడీస్‌ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ గ్రేడింగ్‌ తగ్గించడంతో ఆ కంపెనీ షేర్లు 3శాతం వరకు విలువ కోల్పోయాయి. రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ వంటి దగ్గజ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10పైసలు పెరిగింది. రూ.71.70వద్ద నేడు ట్రేడింగ్‌ ప్రారంభమైంది. సోమవారం దాదాపు 50 శాతం విలువ కోల్పోయిన రూపాయి 71.80 వద్ద ముగిసింది. డిసెంబర్‌ 17 నుంచి ఇదే అత్యల్పం. కనీసం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.

Related posts